మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్‌

  • బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి
  • లోకేశ్ ‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, టీడీపీ నేతలు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలు
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పాత మంగళగిరిలో కొలువైన శ్రీ సీతారామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి లోకేశ్‌కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి లోకేశ్‌ గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Nara Lokesh
Mangalagiri
Sitaramaswamy Temple
AP Minister
Brahmostavam
TDP
Andhra Pradesh
Temple Visit
Nandam Abaddaiah
Tammishetti Janaki Devi

More Telugu News